కెజిబివి సమస్యలపై విద్యామంత్రితో చర్చలు
కెజిబివి సమస్యలపై విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి గారితో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి, కెజిబివి ప్రతినిధులు సిహెచ్ లక్ష్మి, భార్గవి, కృష్ణవేణి సమావేశమై చర్చించారు.
టీచింగ్& నాన్ టీచింగ్ సిబ్బందికి మినిమం బేసిక్ పే ఇవ్వాలని, రెగ్యులర్ మహిళా ఉద్యోగులతో సమానంగా సెలవులు ఇవ్వాలని, కేర్ టేకర్ ను నియమించాలని తదితర తొమ్మిది ముఖ్యమైన సమస్యలను వివరించగా సావధానంగా విన్నారు. పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు.
TSUTF రాష్ట్ర కమిటీ