OUR MISSION

విద్యారంగాన్ని సమైక్యపరిచి అన్ని ప్రాంతాల, అన్ని మేనేజిమెంట్ల, అన్ని కేడర్ల సమైక్య సంఘంగా చారిత్రక అవసరంగా 1974 ఆగస్టు 10న ఏర్పడిన సంస్థ యుటియఫ్‌.
యుటియఫ్‌ స్థాపించిన వెంటనే అత్యవసర పరిస్థితి ఏర్పడినా లెక్కచేయక ఉపాధ్యాయుల పక్షాన నిలిచింది

రీగ్రూపింగ్‌ స్కేళ్లు, పే స్కేళ్ళు పెంపుదల, ఎయిడెడ్‌ టీచర్ల డైరెక్ట్‌ పేమెంట్‌, ఉద్యోగ విరమణ వయసు పెంపుదల 58 నుండి 61 సం॥కు(ఏపీలో 60 సం.లకు), మున్సిపల్‌ టీచర్ల జీతాలు 010 అక్కౌంట్‌ ద్వారా చెల్లించడం, ఉపాధ్యాయుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే కౌన్సిలింగ్‌ జిఓ సాధనతోపాటు అప్రెంటీస్‌ సర్వీస్ కు నోషనల్‌ ఇంక్రిమెంట్లు, ఎస్ సి, ఎస్ టి అన్ ట్రైన్డ్ టీచర్ల నోషనల్ ఇంక్రి మెంట్ల సాధన, అప్రెంటిస్‌ విధానం రద్దుకు స్వతంత్రంగాను, సమైక్యంగాను అగ్రభాగాన నిలిచి పోరాడిన సంస్థ యుటియఫ్‌. 2007 తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో యుటియఫ్‌ బలపరిచిన ఎమ్మెల్సీలు ఏపీలో 13 జిల్లాలకు, తెలంగాణలో ఒక ఎమ్మెల్సీ 10 జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 

రాష్ట్ర విభజన అనంతరం  తెలంగాణ రాష్ట్రంలో అగ్రగామి ఉపాధ్యాయ సంఘంగా ఉంటూ ఐక్య ఉద్యమాల్లో (యుఎస్ పీసీ, కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐక్య వేదిక లాంటి వాటిలో) చురుకైన పాత్ర పోషిస్తూ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల హక్కుల సాధనకు కృషి చేస్తున్నది.

కేంద్ర ప్రభుత్వం విద్యారంగానికి కేటాయింపులు తగ్గించటంతో పాటు, విద్యా కాషాయీకరణకు బీజాలు వేస్తోంది. విద్యారంగం మొత్తం కార్పొరేట్‌ వారికి అప్పగించ బోతుంది. విద్య కార్పొరేటీకరణ, కాషాయీకరణకు వ్యతిరేకంగా ఉపాధ్యాయుల్ని చైతన్యపరచడం, ప్రజలతో కలిసి ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడమే నేడు మన ప్రధాన కర్తవ్యం

 

టియస్ యుటియఫ్ ఉద్యమ చరిత్ర

సంవత్సరం నెల సందర్భం ప్రాంతం
2014 ఏప్రిల్ 13 టియస్ యుటియఫ్ సంఘ ఆవిర్భావం  
2014 సెప్టెంబర్ 24 ’’తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్య‘‘, పై రాష్ట్ర విద్యా సదస్సు రవీంద్ర భారతి, హైదరాబాద్

 

ఉమ్మడి ఉద్యమ చరిత్ర

సంవత్సరం నెల సందర్భం ప్రాంతం
1974 ఆగస్ట్‌ 10 యుటియఫ్‌ సంఘ ఆవిర్భావం అమలాపురంలో ఆఫీస్‌
1974 ఆగస్ట్‌ 20 సంఘ రిజిస్ట్రేషన్‌ కాకినాడలో
1974 అక్టోబర్‌ 20,21 ప్రథమ మహాసభలు రాజమండ్రిలో
1974 నవంబర్‌ 3 వేతన స్థంభన వ్యతిరేక సదస్సులో యుటియఫ్‌ పాల్గొనుట హైదరాబాద్‌లో
1975 జనవరి ఐక్యఉపాధ్యాయ పత్రిక ప్రారంభం
సంఘ కార్యాయం విజయవాడకు తరలింపు
విజయవాడ
1975 జనవరి 11,12 తెంగాణా జిల్లా సదస్సు నిర్వహణ ఖాజీపేటలో
1975 ఫిబ్రవరి 10 సంఘ పక్షాన ప్రభుత్వానికి మహా విజ్ఞాపన పత్రం సమర్పణ  
1975 సెప్టెంబర్‌ సమస్య పరిష్కారానికి 15 వే సంతకాలతో కార్డు క్యాంపెయిన్‌  
1976 ఏప్రిల్‌ నేటివిటి ఉత్తర్వుల, నిర్బంధ రిటైర్మెంటులకు వ్యతిరేకంగా 20 వేల సంతకాలతో విజ్ఞప్తి.  
1976 ఏప్రిల్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో యుటియఫ్‌ అభ్యర్థి ఎం.మాధవరావు గెలుపు. తూర్పురాయలసీమ
1976 సెప్టెంబర్‌ పని దినా పెంపుకు వ్యతిరేకంగా యుటియఫ్‌ గుంటూరు సదస్సు. గుంటూరు
1977 ఆగస్ట్‌ 17,18 ఖమ్మంలో సంఘం ద్వితీయ మహాసభలు ఖమ్మం
1977 సెప్టెంబర్‌ 8 సమస్యల పరిష్కారం కోసం 3 వేలమందితో చలో హైదరాబాద్‌, పబ్లిక్‌ గార్డెన్స్‌లో
ప్రతిపక్ష నాయకులు సమక్షంలో ప్రదర్శకుల డిమాండ్లపై ముఖ్యమంత్రి హామీ.
హైదరాబాద్‌
1978 డిసెంబర్‌ 9 విజయవాడ చెన్నుపాటి భవనం ప్రారంభం విజయవాడ
1979 ఆగస్ట్‌ ఐక్య ఉపాధ్యాయ ప్రచురణ విభాగం నుండి అధ్యాపకదర్శిని ప్రచురణ  
1979 అక్టోబర్‌ ప్రభుత్వానికి యుటియఫ్‌ లక్ష సంతకాల విజ్ఞాపన.  
1981 జనవరి యుటియఫ్‌చే ఉపాధ్యాయుల డైరీ ప్రచురణ  
1981 మార్చి 23 ఉపాధ్యాయుల సమస్యలపై సెక్రటేరియట్‌ ముందు 1000 మందితో ధర్నా  
1981 మే 7 విజయవాడలో మీటింగ్‌ హాలు ప్రారంభం విజయవాడ
1981 ఆగస్ట్‌ 16,17, 18 భీమవరంలో సంఘ 3వ మహాసభలు భీమవరం
1981 సెప్టెంబర్‌ యుటియఫ్‌ వార్తలు ప్రారంభం  
1982 జనవరి 28 రాష్ట్ర వ్యాప్తంగా 30 వేలమందితో ధర్నా  
1982 జూన్‌ కార్డు క్యాంపెయిన్‌  
1982 జులై 19 జిల్లా కేంద్రాలలో ధర్నా  
1982 ఆగస్ట్‌ 30 సెక్రటేరియట్‌ ముందు 1000 మందితో పికెటింగ్‌.
తూర్పురాయలసీమ టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డి. రామిరెడ్డి గెలుపు
 
1983 సెప్టెంబర్‌ 10 హైదరాబాద్‌లో యుటియఫ్‌ భవనం ప్రారంభం. హైదరాబాద్‌
1984 మే, జూన్‌ యుటియఫ్‌ పక్షాన కేటగిరి 3 వారికి రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణా తరగతుల నిర్వహణ.  
1985 జులై 14 యుటియఫ్‌ అకడమిక్‌ సెల్‌ ప్రారంభం, ఎయిడెడ్‌ పాఠశాలల సమస్యలపై సదస్సు  
1986 జనవరి 8,9,10 విజయవాడలో సంఘ 4వ మహాసభలు విజయవాడ
1987 జూన్‌ ఉపాధ్యాయుల మూకుమ్మడి డివిజన్‌ ట్రాన్స్‌ఫర్స్‌ జి.ఓ. 370పై ఆందోళన కార్యక్రమాలు  
1988 జనవరి 13 యుటియఫ్‌కు ప్రభుత్వ గుర్తింపు  
1988 ఏప్రిల్‌ 10-20 జి.ఓ. 370 రద్దుకై ముఖ్యమంత్రికి విజ్ఞాపన పత్రాలు సమర్పణ  
1988 అక్టోబర్‌ 14 జిల్లా కేంద్రాలలో ధర్నాలు  
1989 మార్చి 3 జి.ఓ. 370 రద్దు కోరుతూ చలో అసెంబ్లీ నిర్వహణ  
1989 జూన్‌ 21-24 నెల్లూరులో సంఘ 5వ మహాసభలు నెల్లూరు
1989 సెప్టెంబర్‌ 5-19 ఉపాధ్యాయుల సమస్యలపై కార్డు క్యాంపెయిన్‌, 20,21,22 మండలాల్లో ధర్నాలు  
1989 అక్టోబర్‌ 6 జిల్లాలలో ధర్నాలు  
1990 జనవరి 12 మైనేని మరణం.  
1990 జూన్‌ ఆలిండియా సెకండరీ టీచర్స్‌ ఫెడరేషన్‌లో యుటియఫ్‌ సభ్యత్వం  
1992 ఆగస్టు 10-11 గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల ప్రధమ రాష్ట్ర సదస్సు రంపచొడవరం
1992 సెప్టెంబర్‌ 21 ఉపాధ్యాయ సమస్యలపై 10వేలమందితో చలో అసెంబ్లీ నిర్వహణ  
1992 డిసెంబర్‌ 26 సంఘానికి జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లో సభ్యత్వం  
1993 ఆగస్ట్‌ 8,9,10 సంఘ 6వ మహాసభలు గుంటూరులో
1994 ఆగస్ట్‌ ఎయిడెడ్‌, మున్సిపల్‌, ఏజెన్సీ, సింగరేణి సమస్యలపై ధర్నాలు  
1995 ఆగస్ట్‌ 6-8 రామకృష్ణరావు కమిటీ సిఫారసులకు నిరసనగా మండల, పట్టణ ధర్నాలు, జిల్లాలలో ధర్నాలు  
1996 అక్టోబరు 6-7 గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల ద్వితీయ రాష్ట్ర సదస్సు భద్రాచలం
1997 మార్చి 8,9,10 ఒంగోలులో సంఘ 7వ మహాసభలు ఒంగోలులో
1997 జులై 9 సంఘానికి జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ శాశ్వత సభ్యత్వం  
1997 అక్టోబర్‌ 20 ఎయిడెడ్‌, ట్రైబల్‌ సమస్యలపై ఆయా డైరెక్టరేట్‌ ముందు ధర్నా  
1998 మార్చి 20-26 ఎయిడెడ్‌ సమస్యలపై ముఖ్యమంత్రికి టెలిగ్రామ్ లు, మార్చి 26న జిల్లా కేంద్రాలలో ప్రదర్శన  
1999 మార్చి 3 ఎయిడెడ్‌ ఉపాధ్యాయుల జీతాలపై బడ్జెట్‌ కంట్రోలు ఎత్తివేతకై ధర్నా హైదరాబాద్‌లో
1999 ఆగస్ట్‌ 10 సంఘ రజతోత్సవ వేడుకలు ప్రారంభం  
1999 ఆగస్ట్‌ 29 చెన్నుపాటి భవన ప్రారంభం హైదరాబాద్‌లో
1999 నవంబర్‌ అప్రెంటిస్‌ టీచర్ల సమస్యలపై ముఖ్యమంత్రికి కార్డు క్యాంపెయిన్‌ నవంబర్‌ మొదటి వారం – జి.ఓ. 62, జి.ఓ. 63 అమలుకై ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి విజ్ఞప్తి పత్రాలు.  
2000 జనవరి 18-20 యుటియఫ్‌ రాష్ట్ర రజతోత్సవాలు కాకినాడలో
2000 ఫిబ్రవరి 21 తక్షణ సమస్యలపై జిల్లా కేంద్రాలో ధర్నాలు, మార్చి 6న హైదరాబాద్‌లో ధర్నా  
2000 జులై 10 హైదరాబాద్‌లో గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల రాష్ట్ర సదస్సు  
2000 సెప్టెంబర్‌ 10 సింగరేణి ఉపాధ్యాయుల సదస్సు కొత్తగూడెంలో
2001 మార్చి 21 అప్పారి వెంకటస్వామి మరణం  
2002 జూన్‌ 17 గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సమస్యలపై ఐటిడిఏ ఆఫీసు ఎదుట ధర్నా  
2002 జూన్‌ 22 ట్రైబల్‌ వెల్ఫేర్‌ కమీషనర్‌ ఆఫీసు ఎదుట ధర్నా  
2002 డిసెంబర్‌ 9 తక్షణ సమస్యలపై రాష్ట్ర ధర్నా  
2003 జనవరి 19 రాజమండ్రిలో ఎయిడెడ్‌ ఉపాధ్యాయుల రాష్ట్ర సదస్సు  
2003 మార్చి 8 గుంటూరులో మున్సిపల్‌ ఉపాధ్యాయుల రాష్ట్ర సదస్సు  
2003 మార్చి 29 బదిలీల షెడ్యూల్, అన్‌ట్రైన్డ్‌ ఉపాధ్యాయుల సమస్యలపై రాష్ట్ర ధర్నా  
2003 మే 5 అంతరజిల్లా బదిలీల కొరకు రాష్ట్ర ధర్నా  
2003 జూన్‌ 10 మండల స్థాయి బదిలీలకై డైరెక్టరేట్‌ దిగ్బంధం  
2003 జులై 24 అన్‌ట్రైన్డ్‌ ఉపాధ్యాయుల సమస్యలపై జిల్లా కేంద్రాలలో ధర్నాలు  
2003 ఆగస్ట్‌ 4 మున్సిపల్‌ ఉపాధ్యాయుల సమస్యలపై మున్సిపల్‌ ఆఫీసుల ఎదుట ధర్నాలు  
2003 డిసెంబర్‌ 28-31 సంఘ 9వ రాష్ట్ర మహాసభలు హైదరాబాద్‌లో
2004 జులై 19 ‘ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేద్దాం’ అంశంపై రాష్ట్ర స్థాయి విద్యా సదస్సు హైదరాబాద్‌లో
2004 జులై 27 స్పెషల్‌ విద్యావాలంటీర్ల సమస్యలపై రాష్ట్ర ధర్నా  
2004 సెప్టెంబర్‌ 4 నూతన పెన్షన్‌ విధానాన్ని వ్యతిరేకిస్తూ పట్టణ, జిల్లా కేంద్రాల్లో ప్రదర్శనలు  
2004 సెప్టెంబర్‌ 8 గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల రాష్ట్ర సదస్సు భద్రాచలంలో
2005 సెప్టెంబర్‌ 5,6 తక్షణ సమస్యల పరిష్కారం కోసం ధర్నా, చలో అసెంబ్లీ హైదరాబాద్‌లో
2006 జనవరి 7 అప్రెంటిస్‌ ఉపాధ్యాయుల సెలవు సౌకర్యం కొరకు ధర్నా  
2006 ఏప్రిల్‌ 13 ఎస్‌సి, ఎస్‌టి టీచర్ల సమస్యలపై ధర్నా, ప్రదర్శన హైదరాబాద్‌లో
2006 జులై 6 అక్రమ డెప్యుటేషన్లకు వ్యతిరేకంగా జిల్లా కేంద్రాలలో ధర్నాలు  
2006 జులై 12 మున్సిపల్‌, ఎయిడెడ్‌ ఉపాధ్యాయుల సమస్యలపై జిల్లా కేంద్రాలలో ధర్నాలు  
2007 జనవరి 19 అప్రెంటిస్‌ సమస్యల పరిష్కారానికి డిఎస్‌ఇ కార్యాలయం ముట్టడి  
2007 ఫిబ్రవరి 28 అప్రెంటిస్‌ విధానం రద్దు కోరుతూ చలో అసెంబ్లీ కార్యక్రమం  
2007 మార్చి యుటియఫ్‌ బలపరచిన 7గురు ఎమ్మెల్సీలు విజయం  
2007 మే 14,15 సంఘం 10వ రాష్ట్ర మహాసభలు విజయవాడలో
2007 జూన్‌ పాఠ్య పుస్తకాలకై డిఇఓ కార్యాలయం ముట్టడి  
2007 జూన్‌ 22 డిఎస్‌సి 2006 నియామకాలకై విద్యార్థి సంఘాలతో కలిసి రాష్ట్ర ధర్నా  
2007 సెప్టెంబర్‌ 19 ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ధర్నా  
2007 నవంబర్‌ 16 ఎయిడెడ్‌ టీచర్ల సమస్యలు పరష్కరించాలని చలో అసెంబ్లీ  
2008 జనవరి 7 గిరిజన ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ధర్నా  
2008 జనవరి 19 మున్సిపల్‌ ఉపాధ్యాయుల రాష్ట్ర సదస్సు విజయవాడలో
2008 జనవరి 24 ఎయిడెడ్‌ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి జిల్లా కేంద్రాల్లో ధర్నాలు  
2008 జనవరి 29 కర్నూలులో రాష్ట్ర విద్యా మహాసభ  
2008 ఫిబ్రవరి 18-20 మున్సిపల్‌ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పట్టణ కేంద్రాల్లో ధర్నా  
2008 ఫిబ్రవరి 28-మార్చి3 రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగ రక్షణ యాత్రలు మార్చి 3న రాష్ట్ర ర్యాలీ హైదరాబాద్‌లో
2008 మార్చి 27 అప్రెంటిస్‌, ఎయిడెడ్‌, అప్‌గ్రేడెడ్‌ తదితర సమస్యల పరిష్కారానికి జిల్లా కేంద్రాలలో నిరాహారదీక్షలు  
2008 సెప్టెంబర్‌ 4 పై సమస్యల పరిష్కారానికి చలో అసెంబ్లీ హైదరాబాద్ లో
2008 నవంబర్‌ 12-16 అప్రెంటీస్‌ సమస్యల పరిష్కారానికి దశలవారీ పోరాటం – ప్రాంతీయ కేంద్రాలలో సదస్సులు  
2008 నవంబర్‌ 16-25 పై సమస్యలపై కార్డు క్యాంపెయిన్‌  
2008 నవంబర్‌ 26-28 పై సమస్యలపై జిల్లా కేంద్రాలో నిరాహారదీక్షలు  
2008 డిసెంబర్‌ 3 అప్రెంటిస్‌ సమస్యల పరిష్కారానికి చలో అసెంబ్లీ  
2008 డిసెంబర్‌ 20 బదిలీలు, పదోన్నతులు కోరుతూ జిల్లా కేంద్రాలలో ధర్నాలు  
2009 ఫిబ్రవరి20,21,22 రాష్ట్ర సంఘ 11వ రాష్ట్ర మహాసభలు నల్గొండలో
2009 ఏప్రిల్‌ 22 స్పాట్‌ వాల్యూయేషన్ రెమ్యూనరేషన్‌ రేట్లు పెంపుదల కొరకు ఎస్‌ఎస్‌సి స్పాట్‌ కేంద్రాలలో ప్రదర్శనలు  
2009 ఆగస్ట్‌ 31 ఎయిడెడ్‌ ఉపాధ్యాయుల, పాఠశాలల సమస్యల పరిష్కారానికై చలో అసెంబ్లీ  
2009 అక్టోబర్‌ 12,13 అంతరజిల్లా బదిలీల కొరకు డిఎస్‌ఇ కార్యాలయాల ముట్టడి.  
2009 నవంబర్‌ 3 అంతరజిల్లా బదిలీలు కోరుతూ చలో సెక్రటేరియేట్‌  
2010 జనవరి 7 స్పెషల్‌ విద్యావాంటీర్ల శిక్షణా కాలాన్ని అప్రెంటిస్‌షిప్‌గా పరిగణిస్తూ
ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేయాలని రాష్ట్ర ధర్నా
 
2010 మార్చి 6 కంప్యూటర్‌ టీచర్ల రాష్ట్ర సదస్సు హైదరాబాద్‌లో
2010 మార్చి 8 రాష్ట్ర మహిళా సదస్సు హైదరాబాద్‌లో
2010 మార్చి 10 ఎయిడెడ్‌ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోరుతూ చలో అసెంబ్లీ రాష్ట్ర ధర్నా హైదరాబాద్‌లో
2010 ఏప్రిల్‌ 12 ఎస్‌ఎస్‌సి స్పాట్‌ రేట్ల పెంపుకోసం స్పాట్‌ కేంద్రాలో నిరసన కార్యక్రమం  
2010 ఏప్రిల్‌ 17 భాషా పండితుల అప్‌గ్రేడేషన్‌ జి.ఓ. 330 పునరుద్ధరణకు స్పాట్‌ కేంద్రాలలో నిరసన కార్యక్రమం  
2010 జూన్‌ 6 అప్రెంటిస్‌ టీచర్ల నోషనల్‌ ఇంక్రిమెంట్ల జీ.ఓ.కు వివరణ ఉత్తర్వులు
కోరుతూ ఆర్‌విఎం శిక్షణా తరగతులలో నిరసన
 
2010 జూన్‌ 11 డిఎస్‌సి 2008 నోటిఫికేషన్‌ ప్రకారం అన్ని పోస్టులూ భర్తీ చేయాలని డిఇఓ కార్యాలయాల ముట్టడి.  
2010 జూన్‌ 18,19 అప్రెంటిస్‌ టీచర్ల నోషనల్‌ ఇంక్రిమెంట్లపై వివరణ ఉత్తర్వుల కోసం రాష్ట్ర ధర్నా – చలో సెక్రటేరియట్‌  
2010 జూన్‌ 21-26 నోషనల్‌ ఇంక్రిమెంట్లపై వివరణ కొరకు రాష్ట్ర, జిల్లా కేంద్రాల్లో నిరాహారదీక్షలు  
2010 జూలై 3 మున్సిపల్‌ టీచర్ల సమస్యల పరిష్కారానికి మున్సిపల్‌ కార్యాలయాల వద్ద ధర్నా  
2010 జూలై 12,13 ఎయిడెడ్‌, పండితుల సమస్యలపై రాష్ట్ర ధర్నా, చలో అసెంబ్లీ  
2010 జూలై 21 అన్‌ట్రైన్డ్‌, స్పెషల్‌ విద్యావాలంటీర్ల సమస్యల పరిష్కారం కోరుతూ చలో సెక్రటేరియేట్‌  
2010 జూలై 23 మున్సిపల్‌ సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్‌ డైరెక్టరేట్‌ ముట్టడి  
2010 ఆగస్ట్‌ 6 అప్రెంటిస్‌ విధానం రద్దు కోరుతూ రాష్ట్ర ధర్నా  
2010 ఆగస్ట్‌ 8 రాష్ట్ర స్థాయి విద్యా సదస్సు విజయవాడలో
2010 ఆగస్ట్‌ 30 గిరిజన పాఠశాలల, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఐటిడిఏ కార్యాలయాల వద్ద ధర్నా  
2010 సెప్టెంబర్‌ 5 అప్రెంటిస్‌ విధానం రద్దు, డిఎస్‌సి 2008 వారి నియామకాలు కోరుతూ డిమాండ్స్‌ డే  
2010 సెప్టెంబర్‌ 26-30 స్పెషల్‌ విద్యావాలంటీర్ల, ఎస్‌సి, ఎస్‌టి అన్‌ట్రైన్డ్‌ టీచర్ల సమస్యలు
పరిష్కరించాలని ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రికి లేఖలు
 
2010 అక్టోబర్‌ 3 మున్సిపల్‌ సదస్సు నెల్లూరులో
2010 అక్టోబర్‌ 12 అంతరజిల్లా బదిలీలు చేయాలని కోరుతూ డైరెక్టరేట్‌ ముట్టడి  
2010 అక్టోబర్‌ 13 పై సమస్యలపై డైరెక్టరేట్‌ వద్ద ధర్నా  
2010 అక్టోబర్‌ 18 డిఎస్‌సి 2008 వారి నియామకాలకు షెడ్యూలు ప్రకటించాలని జిల్లా కేంద్రాలలో ర్యాలీ  
2010 డిసెంబర్‌ 16 ఉపాధ్యాయుల ముఖ్య సమస్యల పరిష్కారం కోరుతూ చలో అసెంబ్లీ  
2011 జనవరి 5 డిఎస్‌సి 2002 స్పెషల్‌ విద్యావాలంటీర్లకు ప్రభుత్వ పెన్షన్‌ స్కీము
వర్తింప చేయాలని డిఎస్‌ఇ ఆఫీసు ముట్టడి
 
2011 జనవరి 9,10 అప్రెంటిస్‌ విధానం రద్దు కోరుతూ ఆర్‌విఎం శిక్షణా తరగతులలో నిరసనలు  
2011 జనవరి 23 ప్రధానోపాధ్యాయుల రాష్ట్ర సదస్సు హైదరాబాద్‌లో
2011 ఫిబ్రవరి 11 అప్రెంటిస్‌ విధానం రద్దు చేసి డిఎస్‌సి 2008 వారికి పూర్తి జీతాలు చెల్లించాలని
రచ్చబండ కార్యక్రమంలో ముఖ్యమంత్రికి, మంత్రులకు వినతి పత్రాలు సమర్పణ
 
2011 మార్చి 28,29 అప్రెంటిస్‌ విధానం రద్దు కోరుతూ జిల్లా, డివిజన్‌ కేంద్రాలలో ప్రదర్శనలు  
2011 ఏప్రిల్‌ 8 అప్రెంటిస్‌ విధానం రద్దు కోరుతూ రాష్ట్ర ధర్నా హైదరాబాద్‌లో
2011 ఏప్రిల్‌ 17 అప్రెంటిస్‌ వ్యవస్థ రద్దు కోరుతూ స్పాట్‌ కేంద్రాలలో పికెటింగ్‌  
2011 మే 9,10,11 12వ రాష్ట్ర మహాసభలు కర్నూలు
2011 జూన్‌ 27-29 అప్రెంటిస్‌ విధానం రద్దు కోరుతూ మండల కేంద్రాలు, మున్సిపాలిటీలలో నిరాహారదీక్షలు  
2011 జూలై 4 పై సమస్యలపై జిల్లా కేంద్రాలలో సామూహిక నిరాహారదీక్షలు  
2011 జూలై 28,29 గిరిజన సంక్షేమ పాఠశాలలు, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ఐటిడిఏ వద్ద ధర్నాలు  
2011 ఆగస్ట్‌ 26 అప్రెంటిస్‌ విధానం రద్దు కోరుతూ పాత తాలూకా కేంద్రాలలో సదస్సు  
2011 ఆగస్ట్‌ 28 పిఎఫ్‌ఆర్‌డిఏ బిల్లు ఉపసంహరించాలని రాష్ట్ర సదస్సు విజయవాడలో
2011 ఆగస్ట్ 29 పై సమస్యలపై నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు  
2011 సెప్టెంబర్‌ 3 అప్రెంటిస్‌ విధానం రద్దు కోరుతూ డివిజన్‌, జిల్లా, రాష్ట్ర కేంద్రాలలో భిక్షాటన  
2011 సెప్టెంబర్‌ 6-13 అప్రెంటిస్‌ విధానం రద్దు కొరకు రాష్ట్ర అధ్యక్షలు, పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ నిరవధిక నిరాహారదీక్షలు  
2011 సెప్టెంబర్‌ 6-13 అప్రెంటిస్‌ విధానం రద్దు కొరకు రాష్ట్ర అధ్యక్షలు, పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ నిరవధిక నిరాహారదీక్షలు  
2012 జనవరి 7,8 ఆర్‌ఎంఎస్‌ఏ పోస్టులలో ప్రమోషన్‌ కోటా కోరుతూ ఆందోళన  
2012 జనవరి 23 ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికై కలెక్టరేట్ల ముట్టడి  
2012 జనవరి 25 ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికై డిఎస్ఇ ముట్టడి  
2012 మార్చి 16 ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారానికై చలో అసెంబ్లీ  
2012 ఏప్రిల్‌ 17 ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికై స్పాట్‌ కేంద్రాలలో నిరసన  
2012 జూన్‌ ఆర్‌విఎం శిక్షణా తరగతుల షెడ్యూలుకు నిరసనగా శిక్షణా కేంద్రాల వద్ద నిరసన  
2012 జూన్‌ 22 బదిలీ డిమాండ్ల పరిష్కారం కోరుతూ డైరెక్టరేట్‌ ముట్టడి  
2012 జూన్‌ 23 ఉపాధ్యాయ బదిలీల నిబంధనలలో మార్పు కోరుతూ డిఇఓ కార్యాలయం వద్ద ధర్నా  
2012 జులై 3 అక్రమ బదిలీలకు నిరసనగా ఉత్తర్వులు దగ్ధం  
2012 జులై 14 చెన్నుపాటి శతాబ్ధి ఉత్సవాల ముగింపు కార్యక్రమం గుంటూరు
2012 ఆగస్ట్‌ సారీ టీచర్‌ సినిమాను నిషేధించాలని ర్యాలీలు  
2012 సెప్టెంబర్‌ 5 తరగతి గదిలో సెల్‌ఫోన్ల వినియోగం స్వచ్ఛందంగా మానుకోవాలని యుటియఫ్‌ ప్రతిజ్ఞ  
2013 జనవరి 8 భాషా పండితుల, పిఇటి, ఎయిడెడ్‌, మున్సిపల్‌ టీచర్ల సమస్యలపై జిల్లా కేంద్రాల్లో ధర్నా  
2013 ఫిబ్రవరి 8 2012 డిఎస్‌సి ఉపాధ్యాయులకు పూర్తి జీతాలు చెల్లించాలని కోరుతూ జిల్లా కేంద్రాల్లో ధర్నా  
2013 మార్చి అదాయపు పన్ను పరిమితిని పెంచాలని కోరుతూ కార్డ్‌ క్యాంపెయిన్‌  
2013 ఏప్రిల్‌ 16 టీచర్ల పెండింగ్ సమస్యలపై స్పాట్‌ కేంద్రాల్లో నిరసన  
2013 ఏప్రిల్‌ 27,28,29 యుటిఎఫ్‌ 13వ రాష్ట్ర మహాసభలు తిరుపతి
2013 మే 30 పాఠశాలల విద్యా సమస్యలు ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ అంశంపై జిల్లా కేంద్రాల్లో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు  
2013 జులై 5 ఉపాధ్యాయులకు జెఎల్‌ ప్రమోషన్స్‌ ఇవ్వాలని కోరుతూ ఇంటర్‌ కమీషనరేట్‌ ఎదుట ధర్నా  
2013 జులై 9-11 విద్యారంగ ఉపాధ్యాయ సమస్యలపై మండల / పట్టణ కేంద్రాల్లో ధర్నా  
2013 ఆగస్ట్‌ 28 పాఠశాలల్లో ఖాళీ ఉపాధ్యాయ పోస్టుల్లో తాత్కాలిక ఉపాధ్యాయులను
నియమించాలని జిల్లా / డివిజన్‌ కేంద్రాల్లో ర్యాలీలు
 
2013 నవంబర్‌ 11,12 మున్సిపల్‌, ఎయిడెడ్‌ ఉపాధ్యాయులకు హెల్త్‌కార్డులు ఇవ్వాలని పట్టణ, జిల్లా కేంద్రాల్లో ధర్నా  
2014 జులై 2,3 ఎయిడెడ్‌ సిబ్బందికి పదవీ విరమణ వయస్సు 60 సం॥లు పెంచాలని కోరుతూ జిల్లా కేంద్రాలలో నిరసన ప్రదర్శన