తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉ పాధ్యాయ ఫెడరేషన్ (టిఎస్ యుటిఎఫ్) ఏర్పాటై అప్పుడే ఎనిమిదేళ్ళు గడిచింది. ఈ కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై పోరాటాల్లో టిఎస్ యుటిఎఫ్ చాంపియన్ గా నిలిచింది. ఐక్య ఉద్యమాలకు చిరునామాగా మారింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాంతాలు, యాజమాన్యాలు, క్యాడర్ల అంతరాల దొంతర్లను కాదని సమైక్య ఉపాధ్యాయ ఉద్యమ నిర్మాణమే లక్ష్యంగా 1974 ఆగస్టు 10న ఆవిర్భవించిన ‘ఎపి యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్’ అధ్యయనం,

ఆవిర్భావం:

అధ్యాపనం, సామాజిక స్పృహ లక్ష్యాలుగా ఎమర్జెన్సీని సైతం ఎదిరించి ఉపాధ్యాయ సమస్యలపై అలుపెరుగని పోరాటాలు నిర్వహించింది. పోరాడే సంఘంగా ఉ పాధ్యాయుల మన్ననలు పొందింది. ఐక్య ఉద్యమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ అగ్రగామి సంఘంగా ఎదిగింది. రాష్ట్రం విడిపోయేనాటికి శాసన మండలిలో ఉ న్న16 ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకుగాను 7 స్థానాల్లో ఉద్యమ నాయకులను గెలిపించుకోగలిగింది.

తెలంగాణ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం. ఆవిర్భవించింది. ఆవిర్భావానికి అపాయింటెడ్ తేదీ ప్రకటన వెలువడిన వెంటనే తెలంగాణ ప్రాంతంలోని 10. జిల్లాల యుటిఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో సమావేశం జరిపి 2014 ఏప్రిల్ 13న తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టిఎస్ యుటిఎఫ్) ఏర్పాటు చేసుకున్నాము. అడహాక్ రాష్ట్ర కమిటీని ఎన్నుకుని 2014 జూన్ 2 నుండి అధికారికంగా కార్యకలాపాలు సాగించాము. 2014 అక్టోబర్ 22 న సంఘం అధికార వాణి “వాయిస్ ఆఫ్ తెలంగాణ టీచర్” మాస పత్రికను ప్రారంభించుకున్నాము. ప్రభుత్వ విద్య అభివృద్ధి, ఉపాధ్యాయుల సంక్షేమం, సామాజిక అభ్యున్నతి లక్ష్యంగా నిరంతరం ఆందోళన, పోరాటాలతో ఐక్య ఉద్యమాల నిర్మాణంలో, నిర్వహణలో క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది.

ఐక్యవేదిక:

తెలంగాణ మొట్టమొదట ఉపాధ్యాయ సమస్యలపై గళమెత్తిన సంఘం టిఎస్ యుటిఎఫ్. 2015 ఏప్రిల్ లో పిటిఎఫ్, డిటిఎఫ్ లతో కలిసి మొదటి సారి రాష్ట్ర స్థాయి. పోరాటానికి పిలుపు నివ్వగా, విద్యాశాఖ కార్యదర్శి చర్చలు జరిపి వ్రాతపూర్వకంగా మినిట్స్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో అదే తొలిసారి. చివరిసారి కూడా… ఆ తర్వాత సమావేశాలు జరిగినా మినిట్స్ ఇవ్వలేదు. ఇటీవల కాలంలో అసలు చర్చలు, సమావేశాలు జరపటమే లేదు. రాష్ట్రంలో ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం పోరాటాలకు సిద్దపడిన ఎనిమిది సంఘాలతో 2016లో ఉ పాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుయస్పీసి) ఏర్పడింది. పలు ఐక్య ఉ ద్యమాలకు నాయకత్వం వహించి ఉ పాధ్యాయుల్లో ఆదరణ పొందింది. ప్రస్తుతం 17 సంఘాల భాగస్వామ్యంతో కొనసాగుతోంది. టిటి జెఎసి, జాక్టో లతో కలిసి రాష్ట్రంలోని మొత్తం ఉపాధ్యాయులకు ప్రాతినిధ్యం వహించే 57 ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక జెసిటియు గా ఏర్పడింది. స్వల్ప కాలంలోనే మంచి ఫలితాలు సాధించగలిగినా కొన్ని సంఘాలపై అధికార పక్ష వత్తిడి. కారణంగానో, మరే కారణంగానో.. జెసిటియు ఎక్కువ కాలం మనుగడ సాగించలేకపోయింది.

సిపియస్ రద్దు కోసం:

2004 తర్వాత నియామకం అయిన ఉద్యోగుల కుటుంబాల సామాజిక భద్రతకు శాపంగా మారిన కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సిపిఎస్) రద్దు కోసంఎస్టీఎఫ్ఎస్ఐ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో, రాష్ట్రంలో స్వతంత్రంగా, ఇంకా యుయస్పీసి ఆధ్వర్యంలో ఐక్యంగా పలు ఆందోళనా పోరాటాలు నిర్వహించాము. సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తున్నాము. పోరాటాల ఫలితంగానే సిపిఎస్ ఉద్యోగులకు గ్రాట్యుటీ, మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఫ్యామిలీ పెన్షన్ సాధించుకున్నాము. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉ పాధ్యాయులకు ఓటు హక్కు కోసం జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం చేశాము. కెజిబివి ఉపాధ్యాయులకు ఓటుహక్కు సాధించాము. 2018 బదిలీలను వెబ్ కౌన్సెలింగ్ ద్వారా పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేసి, విజయవంతంగా నిర్వహించటంలో కీలకపాత్ర పోషించాము. ఉమ్మడి సర్వీసు నిబంధనల సాధనకోసం, రాష్ట్రపతి ఉత్తర్వుల రక్షణ కోసం న్యాయ పరంగా మన వంతు ప్రయత్నం చేశాము.

పిఆర్ ని పోరాటం:

రాష్ట్ర ముఖ్యమంత్రి 2018 జూన్ 2న ఇస్తానన్న ఐఆర్ ఇవ్వనందుకు మూడునెలల్లో అమలు చేస్తానన్న పిఆర్సీ ముప్పైనెలలు జాప్యం చేసినందుకు నిరసనగా తెలంగాణ తొలి పిఆర్సీ సాధన కోసం ఉ కొనసాగిస్తున్నాం. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్ & కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రెండు సంవత్సరాలపాటు దశలవారీగా నిర్వహించిన ఐక్య ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నాము. ప్రభుత్వ పెద్దలకు ఆగ్రహం కలిగినా, సంఘాన్ని, నాయకులను వ్యక్తిగతంగా టార్గెట్ చేసినా, అక్రమంగా పోలీసు కేసులు పెట్టినా వెనకడుగు వేయలేదు. ఐక్య పోరాటాల ఫలితంగానే 30% ఫిట్మెంట్ తో నూతన వేతనాలు సాధించుకున్నాము. కెజిబివి, యుఆర్ఎస్, సమగ్ర శిక్ష ఉద్యోగులకు వేతనాల్లో 30% పెంపు అమలు చేయించుకున్నాము.  మోడల్ స్కూల్స్, గురుకులాలవేతన రక్షణ ఉత్తర్వుల జిఓ 46 సాధించుకున్నాం. కెజిబివి, యుఆర్ఎస్ సిబ్బందికి వీక్లీ ఆఫ్, పన్నెండు చేపట్టారు. నెలల వేతనం, రెన్యువల్, బదిలీలు తదితర సౌకర్యాలను సాధించుకున్నాము. గురుకుల ఉపాధ్యాయులకు పిఆర్సీ యాభై శాతం హాజరు, ఉద్యోగం మారిన సందర్భంలో బాండ్ వాల్యూ తగ్గింపు, ఎయిడెడ్ సిబ్బందికి యాన్యువల్ బడ్జెట్ ఒకేసారి విడుదల వంటి సమస్యలు పరిష్కరించుకున్నాం. కెజిబివి, యుఆర్ఎస్, గురుకుల, పాఠశాలల కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించిన కొన్ని ఇంకా రెగ్యులరైజేషన్, బేసిక్ పే సమస్యల పరిష్కారం కోసం పోరాటం కొనసాగిస్తున్నాం.

పండితులు, పిఈటి పోస్టుల అప్డేడేషన్ కోసం 2014 నుండి చేసిన ప్రభుత్వ విద్య బలోపేతం కోసం: నిరంతర ప్రాతినిధ్యాలు, ఐక్య పోరాటాల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం 10479 పోస్టులు అప్గ్రేడ్ చేసింది. ఆ పోస్టుల్లో అర్హతగలిగిన పండితులకే ప్రమోషన్స్ ఇవ్వాలని, ప్రతిగా 5571 ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పోస్టులను ఎన్జీటీలకు మంజూరు చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాము. కోర్టు వివాదాల కారణంగా సమస్య ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయి. 2017 టిఆర్టీ నియామకాలలో జాప్యానికి నిరసనగా,

సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వ బడులు నిర్లక్ష్యానికి గురైనాయి. విద్య లాభసాటి వ్యాపారంగా మారింది. ఇంగ్లీషు మీడియంలోనే నాణ్యమైన విద్య లభిస్తుందనే భ్రమలు తల్లిదండ్రుల్లో కల్పించబడినాయి. ప్రభుత్వ బడుల్లో పిల్లల నమోదు క్రమంగా తగ్గింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని గాడిన పెట్టాలని, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని, ప్రజలందరికీ సమానమైన, నాణ్యమైన విద్యను అందించాలని ప్రభుత్వాన్ని కోరాము. రాష్ట్ర ముఖ్యమంత్రి కెజి టు పిజి నినాదాన్ని ఎలా ఆచరణాత్మకం చేయాలో సూచించాము. 2014 సెప్టెంబర్ 24 న రవీంద్ర భారతిలో రాష్ట్ర విద్యా సదస్సు నిర్వహించి విద్యారంగంపై విధాన పత్రాన్ని విడుదల చేశాము. “ప్రజలు కోరుకున్న విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో అందించటం ప్రభుత్వ బాధ్యత” అనే డిమాండ్ ను ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం 2016 సం. లో 9 జిల్లాల్లో 18 రోజులు విద్యాయాత్ర నిర్వహించాము. ప్రభుత్వ పాఠశాలల్లో సమాంతరంగా ఇంగ్లీషు మీడియం ప్రారంభించాలని, ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ గురుకులాల స్థాయికి అభివృద్ధి చేయాలని టిఎస్ యుటిఎఫ్ ఆనాటినుండే డిమాండ్ చేస్తున్నది. టిఎస్ యుటిఎఫ్ విద్యాయాత్ర స్పూర్తితో ఐదువేల ప్రాథమిక పాఠశాలల్లో స్వచ్ఛందంగా ఇంగ్లీషు మీడియం ప్రారంభించబడింది.

జిల్లాల విస్తరణ, జోన్ ల ఏర్పాటు

రాష్ట్ర ప్రభుత్వం 2016 అక్టోబర్ 11న పరిపాలనా సౌలభ్యం పేరిట చేసిన నూతన జిల్లా ఏర్పాటును స్వాగతించాము. జోనల్ వ్యవస్థ అవసరం లేదంటే తీవ్రంగా వ్యతిరేకించాము. ఎట్టకేలకు 33 జిల్లాలను 7 జోన్లు, 2 మల్టీ జోన్లు గా విభజించి రాష్ట్రపతి ఆమోదం పొందారు. రాష్ట్రపతి నూతన ఆశ్రమ ఉత్తర్వుల (పిఓ 2018 ప్రకారం పోస్టులను లోకల్ క్యాడర్ విభజన చేశారు. ఆయా పోస్టుల్లో ఉద్యోగుల సర్దుబాటు కోసం ఏకపక్షంగా ఇచ్చిన జిఓ 317 ను సవరించాలని పెద్ద ఎత్తున పోరాడాము. బాధితులకు న్యాయం చేయాలని పోరాడుతూనే ఉన్నాము.

కోవిడ్ కాలంలో పాఠశాలల ప్రారంభం, ఆన్లైన్ బోధనకు క్షేత్ర స్థాయిలో గల అవకాశాలపై 33 జిల్లాల్లోని 488 మండలాల్లో 1729 మంది ఉపాధ్యాయులు 1668 గ్రామాలు, వార్డుల్లో సర్వే నిర్వహించి 22502 మంది తల్లిదండ్రులు, 39659 మంది విద్యార్థుల అభిప్రాయాలను సేకరించి ఆన్లైన్లో రికార్డు చేసి రూపొందించిన నివేదిక బెంచ్ మార్క్ గా నిలిచింది. కోవిడ్ కు ముందు ప్రతిఏటా విద్యా సంవత్సరం ప్రారంభంలో సర్కారు బడుల్లో విద్యార్థులు నమోదు కోసం టిఎస్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో “మన ఊరు – మన బడి” పేరుతో ఎన్రోల్మెంట్ క్యాంపైన్ నిర్వహించాము. ఈ కృషి మూలంగా ఏడున్నరేళ్ళ తర్వాత నైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలపై దృష్టి సారించింది.  ఊరు – మనబడి/ మన బస్తీ – మన బడి పేరుతో వచ్చే మూడేళ్ళలో రూ.7289 కోట్ల ఖర్చుతో అన్ని పాఠశాలల్లో 12రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్ణయించింది. మొదటి దశలో ఈ ఆర్థిక సంవత్సరంలోనే 912 పాఠశాలల్లో 3497.62 కోట్లతో మౌలిక వసతులు అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయాలను సంపూర్ణంగా స్వాగతిస్తున్నాము. ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. ఈ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలంటే ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. పర్యవేక్షణ వ్యవస్థను పటిష్టం చేయాలి. ఆంగ్ల మాధ్యమం కోసం అదనపు ఉపాధ్యాయులను నియమించాలి. ఉన్న ఉపాధ్యాయులకు ఇంగ్లీషు మీడియం బోధనపై సమగ్ర శిక్షణ ఇవ్వాలి. పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ కోసం ప్రత్యేకంగా వర్కర్లను నియమించాలి. ప్రతి పాఠశాలలో కనీసం అవసరమైన బోధనేతర ఉన్నది. సిబ్బందిని నియమించాలి. ఆరున్నరేళ్ళుగా నిలిచిపోయిన పదోన్నతులు వెంటనే పూర్తి పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, సబ్జెక్టు టీచర్ల కొరత లేకుండా చూడాలి. పదోన్నతులతోపాటే ఇంగ్లీషు మీడియం ప్రారంభానికి ముందే బదిలీలు కూడా నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.

శాసనమండలిలో ప్రాతినిధ్యం

    ఉపాధ్యాయుల ఆదరణ ఫలితంగా టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు అలుగుబెల్లి నర్సిరెడ్డి ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల ఉమ్మడి అభ్యర్థిగా 2019లో నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి ఘన విజయం సాధించారు. నిరంతరం నియోజకవర్గంలో పర్యటిస్తూ, ఉపాధ్యాయ, ఉద్యోగ సమస్యలపై ప్రాతినిధ్యాలు చేస్తూ, శాసన మండలి వేదికగా సమస్యలు ప్రస్తావిస్తూ, వివిధ సంఘాలు నిర్వహిస్తున్న పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటూ ఎమ్మెల్సీలకు రోల్ మోడల్ గా ఉంటున్నారు. సమస్యల పరిష్కారం కోరుతూ 2021 జులై 14 – 17 తేదీల్లో నల్లగొండ నుండి ప్రగతిభవన్ కు ఎమ్మెల్సీ నిర్వహించిన చారిత్రాత్మక పాదయాత్రకు పలు సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. 2017లో మహబూబ్ నగర్ ఉపాధ్యాయ నియోజకవర్గంలో మొదటి సారి పోటీచేసిన పి మాణిక్ రెడ్డి 50. ఓట్లతో రెండవ స్థానంలో నిలిచారు. రాజకీయ వత్తిళ్ళు, ధన ప్రలోభాలకు అతీతంగా ఉద్యమ అభ్యర్థులకు ఆదరణ ఉంటుందని ఋజువైంది. విద్యారంగ, ఉ పాధ్యాయుల ప్రయోజనాలకోసం నిరంతరం పాటుపడగలిగే అభ్యర్థిని 2023 ఎన్నికల్లో హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది.

పటిష్ట సంఘ నిర్మాణం:

        ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై పోరాడుతూనే సంఘ నిర్మాణ పటిష్టతకోసం టిఎస్ యుటిఎఫ్ కృషి చేస్తున్నది. 33 జిల్లా కమిటీలతో 530 మండలాల్లో సభ్యత్వం కలిగి రాష్ట్రవ్యాప్త సంఘంగా ఉన్నది. ప్రతి సంవత్సరం సభ్యత్వ క్యాంపైన్, మండల మహాసభలు, ప్రతి రెండేళ్ళకు జిల్లా, రాష్ట్ర మహాసభలు నిర్వహించటం, నిరంతరం ఆయా స్థాయిల్లో సమిష్టి నిర్ణయాలు తీసుకుని అమలు చేయటం కార్యకర్తల ఉద్యమ చైతన్యానికి నిదర్శనం. సభ్యత్వం ఏటికేడాది పెంచుకుంటూ, నూతన మండలాలకు విస్తరిస్తూ క్రమంగా పురోగమిస్తున్నది. ఇటీవలి కాలంలో కొన్ని కొత్త జిల్లాల్లో కార్యాలయ భవనాల నిర్మాణం, స్థలాలు నమకూర్చుకోవటం, ప్రాంతీయ కార్యాలయాలను సైతం నిర్మించుకోవటం సంఘ పురోభివృద్ధికి నిదర్శనం. సామాజిక సేవా కార్యక్రమాలు, ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా ఆర్థిక సహకారం అందించటం టీఎస్ యుటిఎఫ్ సామాజిక స్పృహకు నిదర్శనం. కోవిడ్ కాలంలో లాక్ డౌన్ జాతీయ స్థాయి ఉద్యమంలో భాగస్వామ్యం: అవుదాం. కారణంగా ఉపాధి కోల్పోయిన కార్మికులు, పేదలకు రూ.50 లక్షలతో నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ, రెండవ దశలో ఐసోలేషన్ కేంద్రాల నిర్వహణకు ఆర్థిక సహాయం, వలంటీర్లుగా సేవలు అందించటం, హెల్ప్ లైన్ సెటర్ల ఏర్పాటు టీఎస్ యుటిఎఫ్ కార్యకర్తలకే సాధ్యమైంది. కోవిడ్ మహమ్మారి సృష్టించిన అననుకూల పరిస్థితుల్లో సైతం అందుబాటులో గల సాంకేతికతను వినియోగించుకుని ఆన్లైన్ సమావేశాలు, క్లాసుల ద్వారా కార్యకర్తలతో నిత్య సంబంధాలు కొనసాగించటం టీఎస్ యుటిఎఫ్ ప్రత్యేకత. ఆన్లైన్ సభ్యత్వం ద్వారా ఉపాధ్యాయ ఉద్యమంలో నూతన ఒరవడి నెలకొల్పింది. సోషల్ మీడియా ప్లాట్ ఫారం ద్వారా డిపార్ట్మెంటల్ శిక్షణా తరగతులు వెబినార్స్ నిర్వహించాము. యుట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా నిరంతరం విశ్వసనీయమైన సమాచారం ఉ పాధ్యాయులకు అందించటం, ఐసిటి మెళకువలు తదితర క్లాసులు, తెలంగాణ రాష్ట్రంలో ఉ పాధ్యాయ ఉద్యమంలో టిఎస్ యుటిఎఫ్ ను అద్వితీయ శక్తిగా నిలపాలంటే ఈ కృషి సరిపోదు. అన్ని మండలాలకు, అన్ని యాజమాన్యాలకు టిఎస్ యుటిఎఫ్ ను విస్తరింపజేయాలి. 

ఎస్ టి ఎఫ్ ఐ కార్యక్రమాలు:

స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్టీఎఫ్ఎస్ఐ) కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నాము. హైదరాబాద్ వేదికగా జరిగిన జాతీయ మహిళా సదస్సు, ఎస్టీఎఫ్ఎస్ఐ కేంద్ర కార్యవర్గం, జనరల్ కౌన్సిల్ సమావేశాలకు ఆతిథ్యం ఇచ్చాం. సిపిఎస్, ఎన్ స్ఈపి 2020 లకు వ్యతిరేకంగా ఎస్టీఎఫ్ఎఐ నిర్వహించిన దేశవ్యాప్త అంబేద్కర్ క్యాంపైన్లు, ఆందోళనా పోరాటాల్లో చురుకుగా పాల్గొన్నాము. సభ్యత్వంలో సగానికిపైగా ఉన్న మహిళా ఉపాధ్యాయుల సమస్యలపై ప్రత్యేకంగా కేంద్రీకరిస్తున్నాము, మహిళా కార్యకర్తల చైతన్యాన్ని పెంపొందించి నాయకత్వ స్థానాలకు ప్రోత్సహించడం కోసం నిరంతరం క్లాసులు, స్టడీసర్కిల్స్, సమావేశాలు నిర్వహిస్తున్నాము.

రాష్ట్ర స్థాయి మహాసభలు:

టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర మొదటి మహాసభలు 2014 డిసెంబర్ 20, 21, 22 తేదీల్లో సంగారెడ్డిలో, రెండవ మహాసభలు 2016 డిసెంబర్ 10,11,12 తేదీల్లో మహబూబ్ నగర్ లో, మూడవ మహాసభలు 2018 డిసెంబర్ 30,31, 2019 జనవరి 1 తేదీల్లో ఖమ్మంలో, నాలుగవ మహాసభలు 2021 జనవరి 8,9,10 తేదీల్లో హైదరాబాద్ మనంగా నిర్వహించుకున్నాము. మహాసభకు, మహాసభకు మధ్యలో రాష్ట్ర విస్తృత సమావేశాలు 2015 జనవరి 11,12 తేదీల్లో నిజామాబాద్ లో, 2017 డిసెంబర్ 17,18 తేదీల్లో హన్మకొండ లో, 2019 డిసెంబర్ 29,30 తేదీల్లో ఆదిలాబాద్ లో, 2022 ఫిబ్రవరి 27,28 తేదీల్లో నాగర్ కర్నూలు లో నిర్వహించుకున్నాము.

భవిష్యత్ కర్తవ్యాలు

ఉపాధ్యాయులకు అందుబాటులో ఉండాలి. ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో మిలిటెంట్ పోరాటాలు చేయాలి. “వాయిస్ ఆఫ్ తెలంగాణ టీచర్” పత్రిక చందాలు విస్తృతంగా చేర్పించాలి. పాలకుల పంచన చేరి, ఉపాధ్యాయులను పోరాటాలకు దూరం చేసి హక్కులను కాలరాచే సంఘాలకు ఉపాధ్యాయుల్లో స్థానం లేకుండా చేయాలి. అందుకు ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలి. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి, ప్రజాస్వామిక, లౌకిక విలువలతో కూడిన నాణ్యమైన విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో అందించేటందుకు కృషి చేయాలి. టిఎస్ యుటిఎఫ్ ఎనిమిదో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టిఎస్ యుటిఎఫ్ నాయకులు, కార్యకర్తలు, సభ్యులు, ఉపాధ్యాయులు అందరం ఈ కృషిలో భాగస్వాములం కావాలి.

(ఏప్రిల్ 13 టియస్ యుటిఎఫ్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని)